Header Banner

బ్రేకింగ్ న్యూస్! సిట్ విచారణకు సాయిరెడ్డి! వెలుగులోకి వస్తున్న కీలక సమాచారం!

  Fri Apr 18, 2025 11:22        Politics

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ హయాంలో లిక్కర్ స్కాం జరిగిందనేది కూటమి నేతల ఆరోపణ. దీని పైన ఇప్పటికే సిట్ లోతుగా విచారణ చేస్తోంది. ఢిల్లీ లో కేంద్ర హోం మంత్రికి టీడీపీ ఎంపీ క్రిష్ణదేవరాయులు ఈ కేసు వివరాలు అందించారు. ఇందులో మనీ లాండరింగ్ జరిగిందని ఫిర్యాదు చేసారు. ఇటు సాయిరెడ్డి, మిథున్ రెడ్డి, కసిరెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ పరిస్థితుల్లో సాయిరెడ్డి సిట్ ముందు విచారణకు వస్తున్న వేళ వైసీపీ లో ఉత్కంఠ పెరుగుతోంది. సాయిరెడ్డి ఈ కేసులో బాంబ్ పేల్చేందుకు సిద్దమయ్యారనే చర్చ వినిపిస్తోంది. అటు..నోటీసులు అందుకున్న నేతలు కోర్టును ఆశ్రయించారు.

 

సిట్ విచారణకు సాయిరెడ్డి

లిక్కర్ స్కాం విచారణ లో భాగంగా మాజీ ఎంపీ సాయిరెడ్డి సిట్ ఎదుట విచారణకు రానున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తనను విచారణ చేస్తే మరింత సమాచారం ఇస్తానని ఇప్పటికే సాయిరెడ్డి స్పష్టం చేసారు. కాగా, సాక్షిగా ఈ రోజు సిట్ ముందుకు వస్తున్న సాయిరెడ్డి వైసీపీ హయాంలో చోటు చేసుకున్న పరిణామాలను పూర్తి గా వివరించే అవకాశం ఉందని తెలుస్తోంది. సాక్షిగా విజయసాయి చెప్పే అంశాలు మద్యం కుంభ కోణం కేసులో కీలకం అవుతాయని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే మద్యం కుంభకోణానికి సంబంధించి సిట్ అధికారులు కీలకమైన సమాచారాన్ని సేకరించారు. సాయిరెడ్డి ఇప్పటికే ఈ కేసులో కర్మ, కర్త, క్రియ మొత్తం కసిరెడ్డి అని తేల్చి చెప్పారు.

సిట్ విచారణలో

కాగా, సిట్ ఇప్పటి వరకు చేసిన దర్యాప్తులో భాగంగా ఈ వ్యవహారం మొత్తం కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగిందని నిర్ధారించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన మూడు సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ గైర్హజారయ్యారు. అలాగే కసిరెడ్డి ఫోన్లు కూడా స్విచ్ఆఫ్‌లో ఉన్నాయి. కసిరెడ్డి రాకపోవడంతో కుటుంబసభ్యులకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. గత ఐదేళ్లలో మద్యం ద్వారానే కసిరెడ్డి అక్రమంగా ఆస్తులను సంపాదించారని గుర్తించారు. ఆ డబ్బు ద్వారానే అనేక సంస్థల్లో పెట్టుబడులు పెట్టారని, సినిమా తీశారని సిట్ అధికారులు గుర్తించారు. గతంలో సాయి రెడ్డి మద్యం కేసులో కసిరెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో ఆయనకు సంబంధించి మరింత సమాచారం రాబట్టాలని సాయిరెడ్డి ప్రయత్నిస్తున్నారు.


ఆ ఇద్దరికీ ఉచ్చు

ఇటు కసిరెడ్డి తనకు సంబంధం లేని విషయంలో విచారణకు ఎందుకు రావాలని ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో కసిరెడ్డి తండ్రిని సిట్ విచారణ చేస్తోంది. కాగా, కసిరెడ్డి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటీషన్ దాఖలు చేసినట్లు సమాచారం. ఇక.. వైసీపీ ముఖ్య నేత మిథున్ రెడ్డికి రేపు (శనివారం) విచారణకు రావాలని సిట్ నోటీసులు జారీ చేసింది. అటు సుప్రీంలో రిలీఫ్ పొందిన మిథున్.. ఇటు హైకోర్టులో సిట్ విచారణకు న్యాయవాదితో వెళ్లేందుకు అనుమతి తెచ్చుకున్నారు. ఇదే కేసు లో నాడు పని చేసిన అధికారులను సిట్ విచారణ చేసింది. ఇప్పుడు సాయిరెడ్డి సాక్షిగా ఇచ్చే సమాచారంతో ఈ కేసులో రానున్న రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని కూటమి నేతలు అంచనా వేస్తున్నారు.


ఇది కూడా చదవండిరోడ్డుల అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్! 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం.. నారా లోకేష్ హామీ! భూముల ధరలకు రెక్కలు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీ గుట్టు రట్టు! మిధున్ రెడ్డికి బిగుస్తున్న ఉచ్చు! కీలక పరిణామాలు!


ప్రధాని మోదీ నివాసంలో కీలక భేటీ! నేషనల్ అధ్యక్షుడిపై క్లారిటీ! బీజేపీకి కొత్త కెప్టెన్ ఎవరంటే?



వైసీపీ నేతలకు పోలీసుల వార్నింగ్! తిరుపతిలో హైటెన్షన్,సవాల్ విసిరిన..!


ప‌వ‌న్ చేతికి సెలైన్ డ్రిప్‌.. అస‌లేమైందంటూ అభిమానులు ఆందోళ‌న వ్య‌క్తం!



చట్ట విరుద్ధ టారిఫ్‌లు.. ట్రంప్‌కు గవర్నర్ న్యూసమ్ వార్నింగ్! కాలిఫోర్నియా లీగల్ యాక్షన్!



ఇంటి కోసం హడావుడి.. కోర్టు కేసు మధ్య రాజ్ తరుణ్ తల్లిదండ్రుల డ్రామా! బోరున ఏడ్చిన లావణ్య!



టీటీడీ లో మరో కుంభకోణం.. పవిత్రతను కాలరాసినవారికి జైలే గతి! బీజేపీ నేత విచారణకు డిమాండ్!

వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..

 

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #liquor scam #sit inquiry #ysrcp #sai reddy